ప్రజావాణి అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

Nov 3 2026 2:15 AM | Updated on Nov 3 2026 2:15 AM

వనపర్తి: ప్రజావాణిలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచొద్దని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఖీమ్యానాయక్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వినోద్‌కుమార్‌తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి, సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదుదారుడికి పంపించడమే కాకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేకపోతే సంబంధిత శాఖకు లేఖ రాసి పంపించాలన్నారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదుదారుడికి తెలియజేయాలన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చి పెండింగ్‌లో ఉన్న అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో 38 దరఖాస్తులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అదే విధంగా ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 3 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్డీఓ రాంరెడ్డి, జెడ్పీ సీఈవో యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement