అర్హుల ఎంపిక ఇలా..
ఇంటింటికి ఇందిరమ్మ కుట్టుమిషన్ల పథకానికి భారీ స్పందన
● ముగిసిన గడువు..
7 వేలకుపైగా దరఖాస్తులు
● జిల్లాలో తొలివిడత వెయ్యి మిషన్ల
అందజేతకు సన్నాహాలు
● లబ్ధిదారుల ఎంపికపై మహిళల్లో ఆసక్తి
కొత్తకోటలో కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలు
కొత్తకోట రూరల్: పేద నిరుద్యోగ బీసీ మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థిక స్వావలంబన సాధించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి ఇందిరమ్మ కుట్టుమిషన్ల పథకానికి మహిళల నుంచి భారీ స్పందన లభించింది. పథకం దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 30తో గడువు ముగియడంతో ఇప్పుడు అర్హుల ఎంపికపై ఆసక్తి నెలకొంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 7,788 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు వయస్సు ఉండి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న మహిళలు పథకానికి అర్హులు.
● బీసీ మహిళలకు ఉపాధి కల్పించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కుట్టు పని తెలిసిన మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఉపయోగపడనుంది. ప్రభుత్వం తొలుత దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 15 వరకు గడువు విధించగా.. మహిళల విజ్ఞప్తుల మేరకు సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. తొలివిడతలో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టుమిషన్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఒక్కో మిషన్‌్ విలువ సుమారు రూ.12 వేల వరకు ఉండగా.. 100 శాతం రాయితీపై అందించనున్నారు.
రైట్‌వింగ్‌లో గౌతమ్ గురి
గౌతమ్ దీక్షిత్ రెండేళ్లుగా కోచ్ ప్రదీప్ పర్యవేక్షణలో హ్యాండ్‌బాల్ శిక్షణ పొందుతున్నాడు. జట్టులో రైట్‌వింగ్ ప్లేయర్‌గా తన ప్రతిభను చాటుతున్నాడు. ఇప్పటికే రెండు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉమరియాలో జరిగిన 70వ ఎస్‌జీఎఫ్ అండర్–14 జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడాడు. మరిన్ని జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని తన ఆటతీరును మెరుగుపరుచుకోవడంతోపాటు ఉన్నతస్థాయి క్రీడాకారుడిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
భవ్యరాజ్.. పట్టుదలతో సాధన
భవ్యరాజ్ మూడేళ్లుగా హ్యాండ్‌బాల్‌పై ఆసక్తితో సాధన చేస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శిక్షణ తీసుకుంటూ ఆటలో నైపుణ్యాలను పెంచుకుంటున్నాడు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన అండర్–14 ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. అనంతరం ఉమరియాలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున బరిలోకి దిగాడు. తొలిసారి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన ఆశయమని చెబుతున్నాడు.
దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో అధికారులు తదుపరి దశలో పరిశీలన చేపట్టనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన మహిళలను ఎంపిక చేయనున్నారు. మండలస్థాయిలో ఎంపీడీఓలు, పురపాలికల్లో పుర కమిషనర్ల ఆధ్వర్యంలోని కమిటీలు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి కమిటీ తుది లబ్ధిదారుల జాబితాను ఖరారు చేయనుంది. అర్హత, ప్రభుత్వ మార్గదర్శకాలు, అందుబాటులో ఉన్న మిషన్ల సంఖ్య ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది. తుదిజాబితా అధికారికంగా విడుదలయ్యే వరకు లబ్ధిదారుల వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.


