జిల్లావ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిశీలిస్తాం. సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాం. మండల, పట్టణస్థాయిలో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి విచారణ అనంతరం అర్హులైన వారి వివరాలను జిల్లాస్థాయి కమిటీకి పంపిస్తాం. ప్రభుత్వం నిబంధనలు, అందుబాటులో ఉన్న కుట్టుమిషన్ల సంఖ్య ఆధారంగా తుది లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేస్తాం. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టి అర్హులైన మహిళలకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటాం.
– ముజహీద్‌ఖాన్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి
●


