వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని కేడీఆర్‌నగర్‌లో ఉన్న అనూస్ పాఠశాల, నాగవరం ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్‌పన్ అభియాన్–2026, పోక్సో చట్టం–2012పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.దీప కాసరగడ్డ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు గుడ్, బ్యాడ్ టచ్, ఆన్‌లైన్ వేధింపులు, ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం, సైబర్ నేరాలపై అప్రమత్తత తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య ఎదురైతే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098 లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ టోల్‌ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు. అనంతరం సురక్షిత్ బచ్‌పన్ అభియానన్‌లో భాగంగా బాలల హక్కులపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మద్దిలేటి, సీఎంఓ ప్రతాప్‌రెడ్డి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్లు డి.కృష్ణయ్య, రఘు, సైబర్‌క్రైమ్ ఎస్‌ఐ రవిప్రకాష్, డీసీపీఓ రాంబాబు, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


