భూ రీ–సర్వేలో పారదర్శకత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

భూ రీ–సర్వేలో పారదర్శకత పాటించాలి

Oct 30 2026 12:33 AM | Updated on Oct 30 2026 12:33 AM

మదనాపురం: ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా భూ రీ–సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని నర్సింగాపురంలో భూ రీ–సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి భూ కొలతలు, రికార్డుల నమోదు తీరును పరిశీలించి సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు. రీ–సర్వేకు ముందు రైతులు, భూ యజమానులకు తప్పనిసరిగా ముందస్తు సమాచారం అందించి నోటీసులు జారీ చేయాలి.. ప్రతి నోటీసుపై నిబంధనల ప్రకారం అధికారుల సంతకాలు ఉండాలన్నారు. భూముల హద్దులను పక్కాగా నిర్ధారించి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి సందేహాలను నివృత్తి చేస్తూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం సరళాసాగర్‌ ప్రాజెక్టును సందర్శించి ఆయకట్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశువులకు తాగునీరు ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్‌ రేపోలు రాజు, సర్వే సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement