వైభవంగా సంకీర్తన వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సంకీర్తన వారోత్సవాలు

Oct 26 2026 11:57 PM | Updated on Oct 26 2026 11:57 PM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: శ్రీఅన్నమయ్యవాణి లలితా సంగీత విద్యాలయం వ్యవస్థాపకుడు గద్వాల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో నగరంలోని గాయత్రీ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహిస్తున్న శ్రీవనమాలి పాదపద కవితా తాతసంకీర్తన షష్టమ వారోత్సవాలు నాలుగో రోజు సోమవా రం వైభవంగా కొనసాగుతన్నాయి. ఈ సందర్భంగా గద్వాల చంద్రశేఖరరావు నిర్వహించిన సంకీర్తన కచేరీ అద్యంతం అలరించింది. పలు అన్నమయ్య భక్తి గీతాలను ఆలపించారు. సంకీర్తనవారోత్సవాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించకుంది. ఈనెల 29వ తేదీ వరకు సంకీర్తన షష్టమ వారోత్సవాలు జరగనున్నాయి. కార్యక్రమంలో సామవేదం వెంకటమురళీకృష్ణ, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement