ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి

Oct 26 2026 11:57 PM | Updated on Oct 26 2026 11:57 PM

కొత్తకోట/కొత్తకోట రూరల్‌: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కొత్తకోటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా దరఖాస్తుదారులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రామాలు, వార్డుల వారీగా పట్టభద్రులను గుర్తించి, వందశాతం ఓటరు నమోదు లక్ష్యాన్ని సాధించాలని కోరారు. అనంతరం మున్సిపాలిటీలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి, మద్దతు ధర పొందాలని సూచించారు. అలాగే మండలంలోని పాలెం, నిర్వీన్‌ గ్రామాల్లో వందశాతం రాయితీపై 99 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో నూనెగింజల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం రైతులకు ఉచితంగా వేరుశనగ విత్తనాలను అందిస్తోందని ఆయన తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అరుణ శ్రీనివాస్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పల్లవి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు ఎన్‌జే బోయేజ్‌, భీమ చంద్రకాంత్‌, సీడీసీ చైర్మన్‌ చంద్రమోహన్‌రెడ్డి, ఏడీఏ షేక్‌ మున్నా, ఎంపీడీఓ వినీత్‌కుమార్‌, ఏఓ జాస్మిన్‌, సర్పంచ్‌ మిద్దె నీరజ, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బీచుపల్లి యాదవ్‌, రావుల జితేంద్రనాథ్‌రెడ్డి, సుభాష్‌, జేసీబీ రాములు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement