శాసీ్త్రయ పద్ధతులతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ పద్ధతులతో అధిక దిగుబడులు

Oct 26 2026 11:57 PM | Updated on Oct 26 2026 11:57 PM

కొత్తకోట రూరల్‌: పంటసాగు ఖర్చులను తగ్గించి, దిగుబడులను పెంచేందుకు రైతులు శాసీ్త్రయ పద్ధతులను అనుసరించాలని కేవీకే శాస్త్రవేత్త డా.రాజేందర్‌రెడ్డి సూచించారు. పొలం సంరక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో, జాతీయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐఓఆర్‌) సహకారంతో సోమవారం కొత్తకోట మండలం నిర్వేన్‌లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఐఓఆర్‌ శాస్త్రవేత్తలు డా.లక్ష్మమ్మ, డా.సెంతిళీవేలు, డా.సురేశ్‌కుమార్‌ రైతులకు భూసార సంరక్షణ పద్ధతులు, సేంద్రియ ఎరువుల వినియోగం, పచ్చిరొట్ట, జీవ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేరుశనగ, ఆముదం, నువ్వుల సాగులో పాటించాల్సిన మెళకువలను వివరించారు. అనంతరం ఐఐఓఆర్‌ రూపొందించిన బయో పాలిమర్‌ మందును ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా ప్రస్తుతం వేరుశనగ సాగు చేస్తున్న 10మంది రైతులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రామకృష్ణ, ఉపసర్పంచ్‌ సుజాత, ఆనంద్‌, అభ్యోదయ వేరుశనగ రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement