ఫ దెబ్బతిన్న తూములు, అలుగులు
ఫ పట్టించుకోని పాలకులు, ఐబీ అధికారులు
ఫ షట్టర్లు మరమ్మతు లేక
వృథాగా అవుతున్న నీరు
ఫ ఇబ్బందులకు గురవుతున్న రైతులు
ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి
వనపర్తి రూరల్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకుగాను పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్, కాసం, గరుడ, ట్రెండ్స్, చందన బ్రదర్స్, బీఫిట్ తదితర వ్యాపార దుకాణాల్లో పర్యటించి ప్రైవేట్ ఉద్యోగులు, పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవగాహన లోపంతో ఇప్పటి వరకు 36 శాతం మంది పట్టభద్రులు మాత్రమే ఓటు నమోదు చేసుకోవడం ఆందోళనకరమన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి పట్టభద్రుడు ఓటరు నమోదు చేసుకోవాలని కోరారు. ఓటరు నమోదు ప్రక్రియ, అవసరమైన ధ్రువపత్రాలపై అవగాహన కల్పించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, గంధం పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కరువు సహాయక చర్యలు చేపట్టాలి
పాన్‌గల్: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావంతో జిల్లాలో కరువుఛాయలు నెలకొన్నాయని.. కరువు మండలాలుగా ప్రకటించి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా సహాయకార్యదర్శి శ్రీరాం డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని కేతేపల్లిలో పార్టీ నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో సాధారణం కంటే 38 శాతం లోటు వర్షపాతం నమోదైందని.. వర్షాభావ పరిస్థితుల కారణంగా వానాకాలంలో పంటలు తక్కువగా సాగు చేశారని, ఆవి కూడా ఎండిపోయాయన్నారు. కేఎల్‌ఐ, భీమా సాగునీటి కాల్వల ద్వారా తగినంత నీరందక వరి సాగు కూడా తక్కువ విస్తీర్ణంలోనే సాగుచేసినా అవి కూడా సాగునీరు సక్రమంగా అందక, విద్యుత్ కోతలతో సగం వరకు ఎండిపోయాయని వివరించారు. చివరి దశలో ఉన్న పంటలు కూడా చేతికందుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని వివరించారు. అధికారులు స్పందించి సాగునీరు అందిస్తూ, కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. రైతులు, ప్రజలను ఆదుకునేందుకు కరువు సహాయక చర్యలు చేపట్టాలని లేనిచో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు డంగు కుర్మయ్య, కాకం చిన్ననారాయణ, లక్ష్మీనారాయణ, పెంటయ్య, కురువమ్మ, కాకం కాశన్న, మాల కుర్మయ్య పాల్గొన్నారు.


