వ్యక్తిగత దూషణలు సరికాదు : ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత దూషణలు సరికాదు : ఎమ్మెల్యే

Oct 26 2026 2:16 AM | Updated on Oct 26 2026 2:16 AM

వనపర్తి: అహంకార పాలన తమకొద్దని ప్రజలు ఇంటికి పంపినా.. గర్వంతో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మండిపడ్డారు. శనివారం ఎస్పీ, డీఎస్పీ ములాకత్‌ సందర్భంగా మాజీ మంత్రి చేసిన వాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 32 మంది బీసీ నాయకులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయించారని, విలేకర్లపై కూడా కేసులు నమోదు చేయించిన ఘనత మాజీ మంత్రికే దక్కిందన్నారు. నియోజకవర్గంలోని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, నిరుద్యోగులు, వివిధ వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతోనే ఆయన్ను ఇంటికి సాగనంపారన్న విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞులని.. అన్నీ గమనిస్తున్నారని.. సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వనపర్తి రాజకీయాల్లో బెదిరింపులు, వ్యక్తిగత ధూషణల కంటే అభివృద్ధి, ప్రజాసేవే ముఖ్యమని భావించి పని చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement