● నాలుగేళ్లుగా డబ్బులు విడుదల చేయని ప్రభుత్వం
● విద్యుత్ బిల్లులు, తాగునీరు,
స్టేషనరీ ఖర్చులు అధికారులపైనే
● జిల్లావ్యాప్తంగా 72 నిర్మాణం
–IIలో u
కొత్తకోట రూరల్: రైతులకు సాగు మెళకువలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు శాస్త్రవేత్తల ద్వారా సలహాలు, సూచనలు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతువేదికలను నిర్మించింది. కాగా నిర్వహణకు నిధులు మంజూరు చేయకపోవడంతో వ్యవసాయశాఖ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్లుగా విద్యుత్ బిల్లులు, తాగునీరు, స్టేషనరీ, చిన్నచిన్న మరమ్మతులకు సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 72 రైతువేదికలు ఉండగా.. ఇందులో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు గలవి 44 ఉన్నాయి. వీటిల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం నిర్వహిస్తోంది.
ఒక్కో నిర్మాణానికి రూ.22 లక్షలు..
2020లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ క్లస్టర్‌కు ఒక రైతువేదిక చొప్పున నిర్మించింది. ఒక్కో నిర్మాణానికి రూ.22 లక్షలు వెచ్చించగా.. అందులో వ్యవసాయశాఖ రూ.12 లక్షలు, ఉపాధిహామీ పథకం కింద రూ.10 లక్షలు ఉన్నాయి. మొదట్లో నిర్వహణకు రూ.3 వేల చొప్పున మంజూరు చేయగా.. ఆ నిధులు సరిపోవడం లేదని వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరడంతో రూ.9 వేలకు పెంచారు. ఇందులో పారిశుద్ధ్యం కోసం రూ.3 వేలు, విద్యుత్ బిల్లు రూ.వెయ్యి, స్టేషనరీ కొనుగోలుకు రూ.వెయ్యి, తాగునీటికి రూ.వెయ్యి, రైతుల శిక్షణ సమయంలో టీ, అల్పాహారం తదితర ఖర్చులకు రూ.2,500 కేటాయించారు. ఈ నిధులు 2022 నుంచి మూడు నెలలు మాత్రమే వచ్చాయని.. అనంతరం నిలిచిపోయాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం నిధులు మంజూరు చేయడం లేదని తెలిపారు. రైతువేదికల నిర్వహణ తమకు భారంగా మారిందని వాపోతున్నారు.
భారంగా మారిన రైతువేదికలు


