పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం

Oct 25 2026 1:23 AM | Updated on Oct 25 2026 1:23 AM

వనపర్తి: ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లాకేంద్రంలో ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం నుంచి కేడీఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు పోలీసుశాఖ సేవలు, బాధ్యతలపై అవగాహన పెంపొందిస్తున్నామని తెలిపారు. ప్రజల సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణ, సమాజ భద్రతకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.

పోలీస్‌ ఓపెన్‌హౌస్‌..

పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వనపర్తి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం పోలీస్‌ ఓపెన్‌హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసు విధులు, బాధ్యతలు, భద్రత చర్యలపై అవగాహన కల్పించారు. వివిధ రకాల ఆయుధాలను ప్రదర్శించి వాటి గురించి అవగాహన కల్పించారు. అలాగే షీటీమ్స్‌, భరోసా కేంద్రం, యాంటీ నార్కోటిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో మహిళల భద్రత, మహిళలకు అందించే సహాయ సేవలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటి నివారణకు పోలీస్‌శాఖ చేపడుతున్న చర్యలను వివరించారు. ఎస్పీ విద్యార్థులకు పోలీస్‌శాఖ పనితీరుపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సాయుధదళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్‌, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్‌ సీఐలు సుగంధ రత్నం, ఓడీ రమేష్‌, శివకుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ నరేష్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

బైక్‌ర్యాలీలో ఎస్పీ డి.సునీతారెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement