డిఫాల్ట్‌ మిల్లర్లు సీఎంఆర్‌ అప్పగించాలి | - | Sakshi
Sakshi News home page

డిఫాల్ట్‌ మిల్లర్లు సీఎంఆర్‌ అప్పగించాలి

Oct 25 2026 1:23 AM | Updated on Oct 25 2026 1:23 AM

వనపర్తి: డిఫాల్టర్‌ జాబితాలో ఉన్న మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ కోరారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, విజిలెనన్స్‌ డిప్యూటీ కమిషనర్‌ కొండలరావు, డీఎస్పీ వెంకటేశంతో కలిసి అదనపు కలెక్టర్‌ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 నుంచి 2025 ఖరీఫ్‌ వరకు సీఎంఆర్‌ బకాయిలను మిల్లర్లు చెల్లించేందుకు ప్రభుత్వం 45 రోజుల గడువు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని బకాయిలు పూర్తిగా చెల్లించి నాన్‌ డిఫాల్టర్‌ జాబితాలోకి చేరాలని సూచించారు. దీంతో రాబోయే సీజన్లకు సంబంధించి ధాన్యం కేటాయింపులు పొందడానికి అవకాశం సాధించవచ్చని తెలిపారు. అయితే 2022 రబీ వేలం ధాన్యానికి సంబంధించి ఈ అవకాశం వర్తించదన్నారు. ప్రభుత్వానికి సీఎంఆర్‌ అప్పగించని మిల్లర్లపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement