మహిళా ఉద్యోగుల రక్షణకు పోష్‌ చట్టం | - | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగుల రక్షణకు పోష్‌ చట్టం

Oct 25 2026 1:23 AM | Updated on Oct 25 2026 1:23 AM

వనపర్తి రూరల్‌: మహిళా ఉద్యోగుల రక్షణకు పోష్‌ చట్టం అండగా ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో శనివారం ‘పోష్‌ చట్టం–పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిష్కారం) చట్టం, 2013’పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించగా.. ఆయన హాజరై చట్టం ప్రాముఖ్యతను వివరించారు. కోర్టు ఆవరణాలోని కార్యాలయాల్లో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడం బాధ్యతగా భావించాలని, ఉద్దేశపూర్వకంగా ధూషించడం, లైంగిక వేధింపులకు గురిచేయడం చట్ట విరుద్ధమని, పలు సెక్షన్ల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళా ఉద్యోగుల వేధింపులపై కోర్టులోనే అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేస్తామని.. సభ్యులు బాధితుల ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కె.లావణ్య, బాల్‌రెడ్డి, కళార్చన, దీప కాసరగడ్డ, టి.కార్తీక్‌రెడ్డి, శ్రీలత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement