రైతువేదికల నిర్వహణ ఖర్చులు నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి అందడం లేదు. విద్యుత్ బిల్లులు, పారిశుద్ధ్యం, ఇతర నిర్వహణ అవసరాల కోసం సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న నిర్వహణ నిధులను వెంటనే మంజూరుచేసి తమపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలి.
– రవీందర్‌రెడ్డి, ఏఈఓ, అమడబాకుల
రైతువేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా 72 రైతువేదికలు ఉన్నాయి. ఒక్కో రైతువేదిక నిర్వహణకు దాదాపుగా రూ.9 వేల వరకు ఖర్చవుతుంది. 2022 నుంచి నిధులు విడుదల కాలేదు. సమస్యను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. – ఆంజనేయులు,
జిల్లా వ్యవసాయ అధికారి
●


