విద్యుత్‌ కోతలపై కర్షకుల కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కోతలపై కర్షకుల కన్నెర్ర

Oct 23 2026 12:27 AM | Updated on Oct 23 2026 12:27 AM

ఖిల్లాఘనపురం: విద్యుత్‌ కోతలతో విసిగిన కర్షకులు కన్నెర్ర చేశారు. పంట చేతికొచ్చే సమయంలో ఎండుతుండటంతో తట్టుకోలేక గురువారం మండలపరిధిలోని మామిడిమాడ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట మామిడిమాడ, సల్కెలాపురం, పర్వతాపురం, అప్పారెడ్డిపల్లి గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఓ పక్క వర్షాలు లేక, మరోపక్క విద్యుత్‌ కోతలతో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ పొద్దస్తమానం ఎప్పుడుపడితే అప్పుడు ఎల్‌సీ తీసుకోవడంతో ఒకేసారి రెండు, మూడు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. మొదట్లో ఇచ్చినట్లుగానే ఉదయం 3 నుంచి సరఫరా ప్రారంభించాలని కోరారు. విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ ఏఈ సుధాకర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ దగ్గరకు సిబ్బందితో కలిసి వచ్చి రైతుల డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో రైతులు తమ డిమాండ్ల వినతిపత్రం ఏఈకి అందజేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ.. వినతిపత్రంలో కోరిన డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విద్యుత్‌ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించి గ్రామాలకు వెళ్లారు.

మామిడిమాడ

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌

ఎదుట నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement