నిబంధనాలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనాలు

Oct 16 2026 7:17 AM | Updated on Oct 16 2026 7:17 AM

అవగాహన కల్పిస్తున్నాం..

ఇంటి పైకప్పు 750 చ.అ. మించొద్దు

ఇందిరమ్మ ఇళ్లకు..

ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని జిల్లాలో ఇప్పటి వరకు 86 మంది లబ్ధిదారులకు నోటీసులు అందించాం. పైకప్పు విస్తీర్ణం పెంచడంతో లబ్ధిదారులపై అదనపు భారం పడి అప్పుల పాలవుతున్నారని ప్రభుత్వం పరిమితి విధించి ఇళ్ల నిర్మాణం చేపట్టేలా ఆదేశాలిచ్చింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే బిల్లు చెల్లింపులు నిలిచిపోతాయి. ఈ మేరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కొత్త నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం.

– విఠోభా, పీడీ, జిల్లా గృహనిర్మాణశాఖ

అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు గృహనిర్మాణశాఖ షాకిచ్చింది. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సాయం సద్వినియోగం కావాలనే సంకల్పంతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన పైకప్పు విస్తీర్ణానికి మించి అదనంగా వేసేవారిపై నియంత్రణ చర్యలు చేపట్టింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి పైకప్పు విస్తీర్ణం పెంచితే ప్రభుత్వం మంజూరు చేసే ఆర్థిక సాయం నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నారు. కొత్త నిబంధనలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు వర్తిస్తాయని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే జిల్లాలో నోటీసుల పంపిణీ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు.

● క్షేత్రస్థాయిలో చాలామంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గోడల కంటే 3 నుంచి 8 అడుగుల వరకు పైకప్పును ముందుకు పొడిగించినట్లు అధికారులు గుర్తించారు. ఇలా చేయడంతో ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు సరిపోక పేదలు అప్పుల పాలవుతున్నారని, మరికొందరు భారం తట్టుకోలేక ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అందించే సాయంతోనే ఇంటి నిర్మాణం పూర్తి కావాలనే ఉద్దేశంతో పైకప్పు విస్తీర్ణంపై పరిమితులు విధించింది. ఇంటి పైకప్పు విస్తీర్ణం 750 చదరపు అడుగులు దాటితే బిల్లు చెల్లింపులు నిలిపివేస్తామంటూ గృహనిర్మాణశాఖ అధికారులు లబ్ధిదారులకు నోటీసులు పంపిణీ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు.

నత్తనడకన నిర్మాణాలు..

జిల్లాకు మొదటి విడతలో 5,825, రెండోవిడతలో 635 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఇప్పటికే 1,947 ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా.. 312 ఇళ్లు మార్కింగ్‌కు నోచుకోలేదు. మార్కవుట్‌ ఇచ్చిన ఇళ్లు వివిధ దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండటంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు మరింత పెంచారు. ఆయా మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు హౌసింగ్‌ ఏఈలు, డీఈలు గ్రామాల్లో పర్యటిస్తూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

వైశాల్యం పెరిగితే బిల్లు నిలిపివేతకు ఆదేశం

తాజా మార్గదర్శకాలు

జారీ చేసిన ప్రభుత్వం

లబ్ధిదారులు అప్పులపాలు కావద్దనే ఉద్దేశంతోనే..

జిల్లాలో ఇప్పటి వరకు 86 మందికి నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement