కాంగ్రెస్‌ రైతు పక్షపాతి ప్రభుత్వం : ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ రైతు పక్షపాతి ప్రభుత్వం : ఎమ్మెల్యే

Oct 16 2026 7:17 AM | Updated on Oct 16 2026 7:17 AM

గోపాల్‌పేట: ఎప్పుడైనా రైతుల పక్షాన ఉండేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని.. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ప్రవర్తించడం బీఆర్‌ఎస్‌ నాయకులకే చెల్లిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం ఆయన రేవల్లి, ఏదుల మండలాల్లో పర్యటించారు. ఏదులలో పదివేల మెట్రిక్‌ టన్నుల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. మండలానికి త్వరలోనే అంబులెన్స్‌ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానికంగా ఆరోగ్య శిబిరం నిర్వహించి ప్రజలకు వైద్యసేవలు అందించిన ఆస్పత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రేవల్లి మండలం కొంకలపల్లి సమీపంలో ఐదువేల మెట్రిక్‌ టన్నుల గోదాం ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, రైతుల సమస్యలు పట్టించుకోకుండా ఇప్పుడు ప్రజల పక్షాన ఉన్నట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు నాయకుల మాటలు కాకుండా గతంలో అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన పనులను కూడా పరిశీలించాలని కోరారు. గత పాలకులు కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క కమీషన్లకు ప్రాధాన్యమిచ్చి గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదులలో తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయ నిర్మాణాలతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. బండరావిపాకులలో ఆలయ నిర్మాణం, పాఠశాల ప్రహరీ నిర్మాణాని శంకుస్థాపన చేశారు. సొంత పార్టీ నుంచి బయటకు వచ్చి కవిత చేసిన వ్యాఖ్యలు గుర్తుచేస్తూ ప్రజా జీవితంలో ఉన్న నాయకులు గత పాలన, ప్రస్తుత వైఖరిని ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రేవల్లి మండలంలో ఆదర్శ వ్యవసాయం చేస్తున్న మహిళా రైతులను సన్మానించారు. కార్యక్రమంలో ఉమ్మడి మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement