కేఎల్‌ఐ ప్రాజెక్టు మొదటి లిఫ్టు ద్వారా
నీటి ఎత్తిపోతలు
పాలమూరు ప్రాజెక్టులోని మొదటి లిఫ్టు ద్వారా విడుదలవుతున్న నీరు
కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డితోపాటు కేఎల్‌ఐ ప్రాజెక్టుల్లో నీటి ఎత్తిపోతలు గురువారం ముమ్మరంగా కొనసాగాయి. పాలమూరు ప్రాజెక్టులోని మొదటి లిఫ్టులో 2 మోటార్ల ద్వారా బుధవారం నీటి విడుదల చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే 2.15 గంటలపాటు నీటి విడుదల అనంతరం విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో సాయంత్రం 5.30 గంటలకు మోటార్లను ఆపేసిన అధికారులు మళ్లీ రాత్రి 10 గంటల తర్వాత ఎత్తిపోతలు కొనసాగించారు. గురువారం రోజంతా రెండు మోటార్ల ద్వారా నీటి విడుదల కొనసాగింది. అలాగే పాలమూరు ప్రాజెక్టు సమీపంలోనే ఉన్న కేఎల్‌ఐ ప్రాజెక్టు మొదటి లిఫ్టులో కూడా గురువారం మూడు మోటార్లతో నీటి ఎత్తిపోతలు కొనసాగాయి. పక్కపక్కనే ఉన్న ఈ రెండు లిఫ్టుల్లో నీటి విడుదల కొనసాగుతుండటంతో స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడి తరలివచ్చి నీటి పరవళ్లను తిలకించారు.
పాలమూరు,
కేఎల్‌ఐ ప్రాజెక్టుల్లో ముమ్మరంగా
నీటి ఎత్తిపోతలు


