వెట్టి రహిత సమాజ నిర్మాణానికి కృషి | - | Sakshi
Sakshi News home page

వెట్టి రహిత సమాజ నిర్మాణానికి కృషి

Oct 15 2026 8:00 AM | Updated on Oct 15 2026 8:00 AM

వనపర్తి: వెట్టిచాకిరీ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బలవంతపు శ్రమదోపిడీ, బాండెడ్‌ లేబర్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ టి.వినోద్‌కుమార్‌, డీఎస్పీ బాలాజీనాయక్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వెట్టిచాకిరీ, బలవంతపు శ్రమ అనేవి కార్మికుల స్వేచ్ఛ, హక్కులను హరించే చర్యలని పేర్కొన్నారు. వివిధ అసంఘటితరంగాల్లో పనిచేస్తున్న కార్మికులు వెట్టిచాకిరీ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వెట్టిచాకిరీకి గురైన వారు, అలాంటి పరిస్థితులను గమనించిన వారు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన స్వేచ్ఛారథం జిల్లాలో రెండ్రోజుల పాటు పర్యటించనుందన్నారు. ఆటపాటలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం, కార్మికుల హక్కులు, బాధితులకు అందుబాటులో ఉన్న సహాయ సేవల గురించి వివరిస్తారని తెలిపారు. వెట్టిచాకిరీకి సంబంధించిన ఫిర్యాదులు, సాయం కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 080–69434343 సంప్రదించాలని సూచించారు. అనంతరం ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీపీఆర్వో సీతారాం, డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, ఇన్‌చార్జి కార్మిక అధికారి వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

శాసీ్త్రయ పద్ధతులు

పాటించాలి : డీఏఓ

వనపర్తి రూరల్‌: వేరుశనగలో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు శాసీ్త్రయ పద్ధతులను పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు సూచించారు. బుధవారం పట్టణంలోని 19 వార్డులో ఉన్న కమ్యూనిటీ భవనంలో ఆత్మ ఆధ్వర్యంలో వేరుశనగ సాగు చేస్తున్న రైతులకు పొలంబడి కార్యక్రమం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని, పూత దశలో ఎకరాకు 200 కిలోల జిప్సం వేసి అంతర కృషి చేయాలన్నారు. మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కలుపు, లద్దె పురుగు, తామర పురుగులు, సిలీంద్ర తెగులు నివారణకు తగిన చర్యలు చేపట్టాలని వివరించారు. ఆత్మ డిప్యూటీ డైరెక్టర్‌ హైమావతి మాట్లాడుతూ.. విత్తనాలు విత్తడానికి ముందే దుక్కిలో ఎకరాకు 200 కిలోల సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ వేయాలని, పూత, ఊడలు దిగే దశల్లో తగినంత నీరు అందించాలని సూచించారు. అనంతరం రైతులకు సమగ్ర సస్యరక్షణ కిట్లు, వేప నూనె అందించారు. వేరుశనగ సాగు చేసిన రైతుల పొలాలను సందర్శించి పంటల నిర్వహణపై సూచనలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కురుమయ్య, ప్రభావతి, ఏఈఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement