భూ రీ–సర్వే పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

భూ రీ–సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

Oct 15 2026 8:00 AM | Updated on Oct 15 2026 8:00 AM

భీమా కాల్వ గేట్ల వద్ద బందోబస్తును పరిశీలిస్తున్న ఎస్‌ఐ కుర్మయ్య

గోపాల్‌పేట: భూ రీ–సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం గోపాల్‌పేట, ఏదుల మండలాల్లో కొనసాగుతున్న భూ రీ–సర్వేను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. సర్వే రికార్డులు, సర్వే బృందాలు వినియోగిస్తున్న ఆధునిక రోవర్‌ యంత్రాల పనితీరు, భూ సరిహద్దుల గుర్తింపును ప్రత్యక్షంగా చూసి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఆధునిక యంత్రాలతో భూ సర్వే చేయడంతో హద్దులపై స్పష్టత రావడంతో పాటు భవిష్యత్‌లో భూ వివాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సర్వే నిర్వహించే ముందు భూ యజమానులు, సరిహద్దులో ఉండే రైతులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని.. వారి సమక్షంలోనే సర్వే పూర్తి చేయాలని సూచించారు. సర్వే వివరాలు రికార్డుల్లో నమోదు చేసే సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా అధికారులు సమన్వయంతో పనిచేసి వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని.. రైతులు కూడా సర్వే బృందాలకు సహకరించాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్‌ తిలక్‌కుమార్‌రెడ్డి, మండల సర్వేయర్లు, జీపీఓ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement