వనపర్తి రూరల్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్కుమార్ను తొలగించాలని, ఎస్ఐఆర్ను రద్దుచేసి తొలగించిన 13 కోట్ల ఓట్లను పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో సీపీఎం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యహరించాలని, నాయకుల నిర్బంధాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మండ్ల రాజు, గంధం మదన్, బాలస్వామి, రమేష్, నందిమళ్ల రాములు, భాస్కర్, బీసన్న, గట్టయ్య, కురుమయ్య పాల్గొన్నారు.


