ఎల్‌నినోను అధిగమించాలి.. | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను అధిగమించాలి..

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

ఎల్‌నినోను అధిగమించాలి..

ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ససమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు. తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం.. అధికారులు, రైతుల అప్రమత్తతపై సోమవారం హైదరాబాద్‌ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రధానకార్యదర్శి సంజయ్‌జాజు రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని అన్ని రైతువేదికల్లో రైతులు, అధికారులతో ముఖాముఖి నిర్వహించారు. కలెక్టర్‌ మండలంలోని అంకూర్‌ రైతువేదికలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో గతేడాది కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైందని.. అదేవిధంగా రిజర్వాయర్లలో సైతం నీటిమట్టం తగ్గిన కారణంగా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రబీలో ఎవరూ వరి సాగు చేయవద్దని.. దానికి బదులుగా తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, నూనెగింజలు సాగు చేసుకోవాలని సూచించినట్లు చెప్పారు. స్ప్రింక్లర్లు, డ్రిప్‌ ద్వారా మాత్రమే సాగునీరు వినియోగించుకునే విధంగా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో ప్రజలు నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రమాదం ఉందని.. వృద్ధులు, బయట పనిచేసే కార్మికులు జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించినట్లు చెప్పారు. పరిస్థితులను అధిగమించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. వీడియో కాన్ఫరెనన్స్‌లో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్‌, రైతు నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement