ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలి

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

వనపర్తి: సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి దాఖలైన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌తో కలిసి పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదుదారుడికి పంపించడంతో పాటు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఒకవేళ ఫిర్యాదు అంశం తమశాఖ పరిధిలోకి రాకుంటే సంబంధిత శాఖకు లేఖరాసి పంపించాలన్నారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదుదారునికి తెలియజేయాలి తప్ప పెండింగ్‌లో ఉంచరాదని ఆదేశించారు. పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టాలని.. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన అర్జీలను సైతం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగిన ప్రజావాణికి మొత్తం 45 అర్జీలు దాఖలైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణికి 4 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ తిరుపతయ్య, జెడ్పీ సీఈఓ యాదయ్య, శిక్షణ అదనపు కలెక్టర్లు రంజిత్‌రెడ్డి, శ్రావ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement