వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని కొత్తకోట రోడ్‌లో ఉన్న చందన బ్రదర్స్ షాపింగ్ మాల్‌లో దసరా డబుల్ ధమాకా సేల్ ప్రారంభోత్సవానికి ఆదివారం సినీనటి పాయల్ రాజపుత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దుకాణ యజమానులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వనపర్తికి రావడం చాలా సంతోషంగా ఉందని, సీబీఎస్ దసరా డబుల్ దమాకా ప్రారంభోత్సవంలో భాగస్వామిని కావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. సంస్థ ఎండీ జానా సురేష్ మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుబంధంతో తమ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోందన్నారు. తాము ప్రారంభించిన ప్రతి షోరూంకు స్థానిక ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. కాగా పాయల్ రాజ్‌పుత్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.


