చిన్నమారూర్ ఎత్తిపోతల పంప్‌హౌస్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం జరగడంతో పంపులు నడవక పొలాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. కష్టపడి వేసిన వరి, ఇతర పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. ట్రాన్స్‌ఫార్మర్ పోతే కొత్తది రావడానికి నెలలు పడుతుంది. విద్యుత్ అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ బిగించడంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్ ఎత్తుకెళ్లిన దొంగలను గుర్తించి కఠినంగా శిక్షించాలి.
– మద్దిలేటి, రైతు, చిన్నమారూర్
లిఫ్ట్ వద్ద వరుసగా చోరీలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పంప్‌హౌస్‌ల దగ్గర రాత్రి వేళ సెక్యూరిటీ గార్డులను నియమించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. విద్యుత్, నీటిపారుదలశాఖ అధికారులు ఒకరిపై మరొకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. రూ.లక్షల్లో నష్టం వస్తుంది. పోలీసులు రాత్రివేళ గస్తీ పెంచి చోరీలను అరికట్టాలి.
– వెంకట్రాములు, అజ్జకొల్లు (మదనాపురం)
చిన్నమారూర్, నెల్విడి పంప్‌హౌస్‌ల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనంపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. పాత నేరస్తుల హస్తం ఉందనే అనుమానంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం. పాత ఇనుము, రాగి సామగ్రి కొనుగోలు చేసే వ్యాపారులను విచారిస్తున్నాం. త్వరలోనే ఈ ముఠాను పట్టుకొని చోరీకి గురైన సొత్తును రికవరీ చేస్తాం. పంప్‌హౌస్‌ల వద్ద రాత్రిళ్లు పోలీస్ పెట్రోలింగ్ మరింత పెంచుతాం.
– జగదీశ్వర్, ఎస్‌ఐ, మదనాపురం,
– రామన్‌గౌడ్, ఎస్‌ఐ, చిన్నంబావి


