ఈ ఫొటోలో
కనిపిస్తున్న రైతు పేరు రాములు. అమరచింత
స్వగ్రామం. తనకున్న 2 ఎకరాల్లో బోరుబావి కింద వరి సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక గ్రామంలోని పెద్దచెరువు వట్టిపోయి బోరుబావి నుంచి నీరు ఆగి ఆగి వస్తుండటం.. దీనికితోడు రోజుకు కేవలం
6 గంటల విద్యుత్ సరఫరా అవుతుండటంతో నీరందక పంట నెర్రెలు వారిందని
చెబుతున్నారు. పంట చేతికందుతుందనే నమ్మకం లేదంటున్నారు.
అమరచింత: జిల్లాలోని గ్రామాల్లో బోరుబావుల కింద వానాకాలం వరి సాగు చేసిన రైతులను అప్రకటిత విద్యుత్ కోతలు తీవ్ర నష్టాలను కలిగిస్తున్నాయి. వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతులు తమ బోరుబావుల కింద వరి సాగుచేశారు. ప్రస్తుతం రోజుకు సుమారు 10 గంటల విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. నీరు సమృద్ధిగా ఉన్న బోరుబావుల వద్ద వరి, నీటి సౌకర్యం అంతంత మాత్రంగా ఉన్న రైతులు ఆరుతడి పంటలైన పత్తి, కంది సాగుచేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు కూడా ఆశించిన మేర కురవకపోవడంతో భూగర్భ జలమట్టం సైతం పడిపోతుండటంతో సాగు చేసిన ఆరుతడి పంటలను దక్కించుకునేందుకు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.
అప్రకటిత కోతలతో అవస్థలు..
వ్యవసాయానికి రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు త్రీ ఫేజ్ విద్యుత్‌ను అందిస్తున్నారు. మధ్యమధ్యన ఎల్‌సీలు, ఓవర్‌లోడ్, మరమ్మతు పేరిట సరఫరా నిలిపివేస్తుండటంతో కేవలం 6 గంటల సరఫరా కూడా పొందలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. సాగుచేసిన పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. విద్యుదుత్పత్తి ఆశించిన స్థాయి లో జరగకపోవడం, ఉన్న విద్యుత్‌ను సద్వినియోగం చేసుకునే దిశగా వ్యవసాయానికి కోతలు విధించాల్సి వస్తోందని ట్రాన్స్‌కో అధికారులు వెల్లడిస్తున్నారు.
● జూరాలలో నీరు సమృద్ధిగా ఉన్నా.. ఆయకట్టుకు సైతం సాగునీటిని వారాబందీ విధానంలో అందించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామా ల్లోని చెరువు లు, కుంటలు సైతం వట్టిపోవడంతో వ్యవసాయ బోరుబావుల్లో నీటిమట్టం తగ్గి నీరు ఆగి ఆగి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
చిన్నంబావి 4,926
వనపర్తి టౌన్ 4,958
పెద్దమందడి 5,136
గోపాల్‌పేట 5,638
వీపనగండ్ల 5,781
ఖిల్లాఘనపురం 4,716
శ్రీరంగాపురం 2,353
అమరచింత 3,469
మదనాపురం 3,021
ఆత్మకూర్3,054
రేవల్లి 3,612
కొత్తకోట4,848
మండలాల వారీగా
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు
విద్యుదుత్పత్తి లేకపోవడంతో..
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వానాకాలం ఆశించిన మేర వర్షాలు లేక ప్రధాన జలాశయాల్లో నీటిమట్టం తగ్గి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఉన్న విద్యుత్‌ను జాగ్రత్తగా వినియోగించుకునేందుకు వ్యవసాయానికి 12 గంటల పాటు అందిస్తున్నాం. రైతులు ఆరుతడి పంటలు వేసుకుంటే ఉన్న విద్యుత్‌తో నీరందుతుంది. – తాతారావు, ఎస్‌ఈ, ట్రాన్స్‌కో
అప్రకటిత కోతలతో ఎండుతున్న పంటలు
రోజువారీగా సుమారు
10 గంటలు మాత్రమే సరఫరా
జిల్లాలో 64,235 విద్యుత్ కనెక్షన్లు
జిల్లాలో బోరుబావుల కింద
1.20 లక్షల ఎకరాలు
పాన్‌గల్
7,775
పెబ్బేరు
4,070
వనపర్తి
878


