గిరిజనులకు అండగా ఎస్టీ కమిషన్‌ | - | Sakshi
Sakshi News home page

గిరిజనులకు అండగా ఎస్టీ కమిషన్‌

Sep 30 2026 12:46 AM | Updated on Sep 30 2026 12:46 AM

వనపర్తి: గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం జాతీయ ఎస్టీ కమీషన్‌ను ఏర్పాటు చేసిందని, కమీషన్‌ పనితీరుపై అవగాహన పెంచుకొని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌ సూచించారు. మంగళవారం జిల్లాలోని వివిధ గిరిజన ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించి అక్కడికి వచ్చిన గిరిజనుల సమస్యలు తెలుసుకొని వారి ఎదుటే అధికారులను అడిగి పరిష్కారానికి గడువు విధిస్తూ అందుకు సంబంధించిన ప్రతిని పంపించాలని ఆదేశించారు. ఎక్కువగా రెవెన్యూ, ఫారెస్ట్‌ శాఖలకు సంబంధించిన అంశాలపై సమస్యలు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. అన్నింటిని పరిష్కరించాలని లేదంటే.. ఎస్టీ కమిషన్‌ పరిధిలో విచారణ చేసి పరిష్కరించాల్సి ఉంటుందని, అందుకు జాతీయ ఎస్టీ కమిషన్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు నిర్వహిస్తోందన్నారు. సమస్య ఏదైనా మొదట సంబంధితశాఖ మండల, జిల్లాస్థాయి అధికారులకు విన్నవించి పరిష్కారం కాకుంటే కమిషన్‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజావాణి అర్జీలను పరిష్కరించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక వెనుకబడి ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా జిల్లాల్లో నిర్వహించే గ్రీవెన్స్‌లకు వచ్చిన అర్జీలే మళ్లీ మళ్లీ వస్తున్నాయని.. ఇందుకు కారణం సమస్యను పరిష్కరించకపోవడమేనని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం పర్యటనలో తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ సునీతారెడ్డికి సూచించారు. ఏ సమస్య ఉన్నా ncstgrams పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు ఎస్టీ కమిషన్‌ ఉందని ఎస్టీలకు భరోసా కల్పించారు. పాన్‌గల్‌ మండలంలో వైద్యులు, అదనంగా ఏఎన్‌ఎం నియమించాలని సూచించారు. పెద్దగూడెంతండాలో ఇంతవరకు ఇంటినంబర్లు ఇవ్వడం లేదని, ఇబ్బందులు పడుతున్నామని తండావాసులు కమిషన్‌ దృష్టికి తెచ్చారు. స్పందించిన సభ్యులు 15 రోజుల్లో ఇంటినంబర్లు కేటాయించాలని పంచాయతీ అధికారిని ఆదేశించారు. కొన్నితండాలకు రోడ్డు సౌకర్యం లేదని, మరికొన్నింటికి అటవీ భూమి ఉందని రహదారులు వేయడం లేదని కమిషన్‌ దృష్టికి వచ్చిందన్నారు. ఆయా సమస్యలను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ భూముల్లో ఇప్పటికే కాస్తులో ఉన్న రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో సిగ్నల్‌ సరిగా లేవని, బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉ న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడ సమ స్య ఉందో గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారిని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement