బోరుబావి కింద ఎకరన్నర వరి సాగుచేశా. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరుబావిలో నీటిమట్టం తగ్గిపోవడం, మరోపక్క విద్యుత్ కోతలతో పంటకు సక్రమంగా నీరు అందక ఎకరా పంట పూర్తిగా ఎండిపోయింది. సుమారు రూ.30 వేలకుపైగా నష్టం వాటిల్లింది. – ప్రవీణ్‌కుమార్‌రెడ్డి,
అన్నారం (పాన్‌గల్)
మిర్చి కాపాడుకోలేకపోతున్నాం
మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని బోరుబావి నీటితో మిర్చి సాగుచేశా. వర్షాలు లేకపోవడం, చెరువులో నీరు అడుగంటి బోరు రీచార్జి కావడం లేదు. పంటను కాపాడేందుకు పక్క పొలం రైతు సాయంతో నీటిని మళ్ళించుకొని అందిస్తున్నా.. ఆశించిన ఫలితం కనిపించడం లేదు. కరెంట్ కష్టాలు కూడా అధికం కావడంతో ఈసారి రూ.3 లక్షల నష్టం తప్పదనిపిస్తుంది. – లింగానాయక్,
తూక్యానాయక్ తండా
●


