జూరాలకు 70 వేల క్యూసెక్కుల వరద | - | Sakshi
Sakshi News home page

జూరాలకు 70 వేల క్యూసెక్కుల వరద

Aug 22 2026 12:30 AM | Updated on Aug 22 2026 12:30 AM

గద్వాల/ఆత్మకూర్‌/అచ్చంపేట: ఎగువ ప్రాంతాల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శుక్రవారం 70,495 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరగా.. వివిధ కాలువలు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.06 మీటర్లకు చేరింది. నీటి నిల్వ 8.73 టీఎంసీలుగా నమోదైంది. విద్యుదుత్పత్తికి 42,401 క్యూసెక్కులు, నెట్టెంపాడు, భీమా–1, భీమా–2, కోయిల్‌సాగర్‌ తదితర ప్రాజెక్టులకు కలిపి మొత్తం ప్రాజెక్టు నుంచి 76,803 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఎగువ, దిగువ జలవిద్యుత్‌ కేంద్రాల్లో 11 యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేపట్టారు. ఎగువ కేంద్రంలో ఆరు యూనిట్లతో 234 మెగావాట్లు, దిగువ కేంద్రంలో ఐదు యూనిట్లతో 200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు కేంద్రాల్లో కలిపి 139.917 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. కాగా.. శ్రీశైలం జలాశయంలో 167.8764 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిమట్టం 875.90 అడుగులకు చేరింది. ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 20.159 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా కాల్వకు 3,050 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 8 వేల క్యూసెక్కులు, ఎంజీకేఎల్‌కు 2,400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

పీయూలో సీపీఆర్‌పై

అవగాహన

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిపుణులు బాబుల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌షాక్‌, రోడ్డు ప్రమాదాలు తదితర ఘటనల్లో వ్యక్తులు స్పృహ కోల్పోయినప్పుడు వెంటనే అత్యవసర చికిత్స అందించాలని సూచించారు. కొన్ని నిమిషాల్లో సీపీఆర్‌, ప్రథమ చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడడంతో పాటు పరిస్థితి విషమించకుండా నిరోధించవచ్చన్నారు.

11 యూనిట్లతో 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి

శ్రీశైలానికి తగ్గిన వరద..

167.87 టీఎంసీల నిల్వ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement