పెబ్బేరు ఘటనలో 13 లక్షల గన్నీ బ్యాగులు బూడిద పాలు
బీమా సంస్థల ప్రతినిధుల
పరిశీలన..
రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ..
సీసీ నిఽఘా ఎందుకు లేదు..?
వనపర్తి: జిల్లాలోని పెబ్బేరు మార్కెట్‌యార్డులోని గోదాంలో 2024, ఏప్రిల్ 1న ఒక్కసారిగా మంటలు చెలరేగి సుమారు 13 లక్షలకుపైగా గన్నీబ్యాగులు పూర్తిగా కాలిపోయాయి. వనపర్తి, కొత్తకోటకు చెందిన రెండు ఫైరింజన్లు వచ్చి ఆర్పేందుకు ప్రయత్నిస్తే.. 24 గంటల తర్వాతగాని మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనపై పోలీసు విచారణతో పాటు కేసు నమోదు చేయడం, హైదరాబాద్ నుంచి ఫొరెన్సిక్ నిపుణులను రప్పించి ఆధారాలను సేకరించే ప్రయత్నం చేశారు. మంటలు భారీగా ఎగిసిపడటం, మంటలు ఆర్పేందుకు గోదాం గోడలను కూల్చివేయడం తదితర కారణాలతో వారికి తగిన ఆధారాలు లభించకపోవడంతో గోదాం పైకప్పు రేకులు ఎండకు వేడెక్కి మంటలు రావటంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేల్చినట్లు తెలుస్తోంది. కాగా.. రూ.కోట్ల విలువైన గన్నీబ్యాగుల అగ్నిప్రమాదం జరిగి 28 నెలలు దాటినా నేటికీ బీమా సంస్థలు డబ్బులు ఇవ్వకపోవడం శోచనీయం. రూ.కోట్ల ప్రజాధనంపై సంబంధిత అధికారులు సైతం ఆశించిన మేర దృష్టి సారించకపోవడంతో బీమా వర్తింపజేయడంలో ఆయా సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు స్థానికంగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య అగ్నిప్రమాదం చోటు చేసుకుందని ఆరోపణల నేపథ్యంలో బీమా వర్తింపు ఆలస్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గోదాంలో భద్రపర్చిన గన్నీబ్యాగులకు పౌరసరఫరాల కార్పొరేషన్ బీమా చేయించడంతో క్లెయిం కోసం దరఖాస్తు చేశారు. బీమా సంస్థ ప్రతినిధులు ఘటన స్థలాన్ని పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కానీ సుమారు 28 నెలలు కావస్తున్నా.. ఇప్పటికి ఇంకా అడుగు ముందుకు పడలేదు. కానీ గోదాం ఇన్స్యూరెన్స్ రూ.కోటి వరకు క్లెయిమ్ కావడం గమనార్హం. ప్రమాదానికి గల కారణాలను సక్రమంగా పేర్కొనకపోవడంతోనే క్లెయిమ్ ఆలస్యమవుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
గోదాంలో మంటల్లో కాలిపోతున్న రూ.కోట్ల విలువైన గన్నీబ్యాగులు (ఫైల్)
28 నెలలు దాటినా.. అందని సొమ్ము
కోట్ల రూపాయల నష్టం
కారణాలపై దృష్టి సారించని
అధికారులు
మంటల్లో కాలిపోయిన గన్నీబ్యాగులకు బీమా చేయించాం. క్లెయిమ్ కోసం కావాల్సిన అన్నిరకాల డాక్యుమెంట్లు అందజేశాం. పలుమార్లు బీమా సంస్థ అధికారులు పరిశీలనలు చేశారు. త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇకపై బీమా కోసం ఫాలోఅప్ చేస్తాం.
– ఆంజనేయులు,
డీఎం, పౌరసరఫరాల కార్పొరేషన్
రూ.8 కోట్ల నుంచి రూపది కోట్ల విలువ చేసే సుమారు 13 లక్షలకుపైగా గన్నీబ్యాగుల భద్రత గోదాం చుట్టూ సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నా.. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించకపోవడం గమనార్హం. పర్యవేక్షణ చేయాల్సిన కార్పొరేషన్ అధికారులు రూ.కోట్ల క్లెయిమ్ రావాల్సిన విషయంపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేకపోవడం శోచనీయం.


