రాజేంద్రప్రసాద్‌కు సముచిత స్థానం | - | Sakshi
Sakshi News home page

రాజేంద్రప్రసాద్‌కు సముచిత స్థానం

Aug 19 2026 12:42 AM | Updated on Aug 19 2026 12:42 AM

వనపర్తి రూరల్‌: టీపీసీసీ రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్‌ యాదవ్‌ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాష్ట్ర పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నేతాజీ నేటి

యువతకు ఆదర్శం

వనపర్తిటౌన్‌: నేతాజీ చూపిన ధైర్యం, దేశభక్తి, నాయకత్వ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని జెడ్పీ మాజీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు అధ్యక్షతన స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్‌హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా నేతాజీ చేసిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు. బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ద్వారా స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఆర్‌.వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, బాశెట్టి శ్రీనివాసులు, కృష్ణగౌడ్‌, నక్క మహేష్‌, కొమ్ము శ్రీనివాసులు, విజయ్‌సాగర్‌, ఎండీ ఖలీల్‌, ద్వారపోగు నారాయణ, రాయన్నసాగర్‌ పాల్గొన్నారు.

యాజమాన్య పద్ధతులపై అవగాహన

అమరచింత: మిరప, పత్తి, చెరుకు సాగుచేసిన రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన దిగుబడులు పొందవచ్చని కేవీకే శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చంద్రానాయక్‌తండాలో రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని.. మెట్ట పంటలు కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయం అలోచించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ అరవింద్‌, సర్పంచ్‌ కృష్ణానాయక్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement