చెడు వ్యసనాలకు బానిసవుతున్న యువతరం
● మద్యం, గంజాయి, అశ్లీల వీడియోల మత్తులో..
● జిల్లాలోని 25 మందిపై కేసులు నమోదు చేసిన సైబర్
పెట్రోలింగ్ విభాగం
● తల్లిదండ్రుల
పర్యవేక్షణ, ..
స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై నియంత్రణ కరువు
పర్యవేక్షణే కీలకం..
పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? స్మార్ట్‌ఫోన్లలో ఏం చూస్తున్నారు? అనే విషయాలపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి సారించాలి. వారితో నిత్యం కొంత సమయం గడుపుతూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించాలి.. వాటిలోని మంచి, చెడులను అర్థమయ్యేలా వివరిస్తూ స్నేహపూర్వకంగా మెలగాలి. వారికి ఏదైన సమస్య ఉంటే మనతో చెప్పుకొనేలా మలుచుకోవాలి. వారిని క్రీడలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాలవైపు దృష్టి సారించేలా ప్రయత్నించాలి.
విస్తృత అవగాహన అవసరం
యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు పోలీస్, ఎకై ్సజ్, వైద్య, విద్య, యువజన సంక్షేమ శాఖలు ప్రస్తుతం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. యువత విద్య, ఉపాధి అవకాశాల్లో సాధించిన అంశాలను విద్యార్థులకు ఎప్పటికప్పుడు చేరవేసి అందివచ్చిన సాంకేతికతను సక్రమ మార్గంలో వినియోగించుకునేలా నిత్యం అవగాహన కల్పించాలి. ఉదయం ప్రార్థన సమయంలో ప్రముఖుల విజయగాథ వినిపిస్తూ.. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలని నింపాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలు, చట్టపరమైన పరిణామాలు, మానసిక, శారీరక ప్రభావాలను సైతం వివరించాలి.
వనపర్తి: ఉన్నత చదువులతో జీవితానికి బంగారు బాటలు వేసుకోవాల్సిన యువత చెడు వ్యసనాలతో పెడదోవపడుతోంది. కళ్లెదుటే భవిష్యత్ తరం మద్యం, గంజాయి, అశ్లీల వీడియోల కేసులో నిందితులై ఉజ్వల భవిష్యత్‌ను చేతులారా నాశనం చేసుకోవడం.. ఏటా కేసుల సంఖ్య పెరగుతుండటం ఆందోళనకర సంకేతాలేనని చెప్పవచ్చు. తాము కష్టాల ఊబిలో నుంచి వచ్చాం.. తమ పిల్లలకు ఆ పరిస్థితులు రావద్దని, వారి భవిష్యత్‌పై ఎన్నో కలలుగన్న తల్లిదండ్రులు ఏమరపాటుతో కల్పించే స్వేచ్ఛ, సౌకర్యాలు వారిని పెడదోవ పట్టిస్తున్నాయని పలు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటంతో పాటు స్మార్ట్‌ఫోన్లలో నిషేధిత అశ్లీల వీడియోలకు బానిసలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరదాగా మొదలయ్యే అలవాట్లు క్రమంగా వ్యసనంగా మారి చదువు, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు, జీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
తెరపై విష సంస్కృతి..
నేటి యువతరం చేతికి స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. వీటిని చదువులో అదనపు సమాచారం, ఆధునిక విద్యావిధానం కోసం వినియోగించేవారు కొందరైతే.. మరికొందరు ఇతర వ్యసనాలకు వినియోగిస్తూ కేసుల బారిన పడుతున్నారు. అశ్లీల, హింసాత్మక కంటెంట్‌కు కూడా సులభంగా చేరువవుతూ బానిసలవుతున్నారు.
చెడు వైపు అడుగులు..
ఏడాది వారీగా నమోదైన కేసులు


