సీపీఎస్‌ రద్దు చేసే వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దు చేసే వరకు పోరాటం

Aug 10 2026 12:58 AM | Updated on Aug 10 2026 12:58 AM

వనపర్తిటౌన్‌: సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 23న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. ఉద్యోగ, ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ఎదుట తెలంగాణ రాష్ట్ర సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. జీవితం ప్రభుత్వ సేవకు అంకితమై విధులు నిర్వర్తిస్తుంటే.. పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతతో గౌరవప్రదమైన జీవితం గడపడానికి పింఛన్‌ ఎంతో ముఖ్యమని చెప్పారు. సీపీఎస్‌ ఉద్యోగులు తమ భవిష్యత్‌తో పాటు కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకొని సీపీఎస్‌ రద్దు చేసేందుకు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌, కోశాధికారి సాయిచందర్‌రెడ్డి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌, పీఆర్టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు బౌద్ధారెడ్డి, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి శ్రీనివాసులు, టీపీయూఎస్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ప్రధానకార్యదర్శి శశి, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర బాధ్యులు మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement