గడువులోగా వివరాల నమోదు పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా వివరాల నమోదు పూర్తిచేయాలి

Jul 5 2026 2:18 AM | Updated on Jul 5 2026 2:18 AM

వనపర్తి: ఎన్యూమరేషన్‌ ఫారాలను ఓటర్లతో తప్పులు లేకుండా పూరించి గడువులోగా యాప్‌లో నమోదు చేయాలని రాష్ట్ర అదనపు ఓటరు నమోదు అధికారి చిన్నయ్య బీఎల్వోలకు సూచించారు. శనివారం పుర పరిధిలోని 117, 125, 158 పోలింగ్‌ కేంద్రాల్లో పర్యటించి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలు ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ, ఫారం పూరించే విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఓటర్లతో మాట్లాడి ఫారం నింపడంలో వస్తున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పూరించిన ఫారాలను కచ్చితంగా తిరిగి బీఎల్వోలకు ఇవ్వాలని లేనిపక్షంలో ఓటరు జాబితాలో పేరు నమోదు కాదని తెలిపారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement