● ప్యాకేజీ–16 కాల్వ పనుల్లో జాప్యంపై ఆగ్రహం
● రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి: కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకత పాటించాలని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో ఏదుల, పాన్‌గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీడీఓలు, డీపీఓ, డీఎల్పీఓలతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని హౌసింగ్ పీడీ, ఏఈలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఏయే పనులకు ఎంత వెచ్చించాలో వివరిస్తూనే గ్రామాభివృద్ధిలో అధికారుల పాత్ర అత్యంత కీలకమన్నారు. అనంతరం నీటిపారుదలశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలు, కాల్వల లైనింగ్, డిస్ట్రిబ్యూషన్ పనుల పురోగతిపై చర్చించారు. ప్యాకే జీ–16 కాల్వ పనుల్లో జరిగిన అవకతవకలపై సీఈ, ఎస్‌ఈ స్థాయి అధికారులను నిలదీశారు. పను ల్లో నాణ్యత లోపించడం, నిధుల దుర్వినియోగంపై అస హనం వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని రాష్ట్ర సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్యాకేజీ–16కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఆదేశిస్తూ త్వరలోనే తాను క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


