సోదరభావానికి ప్రతీక రంజాన్‌ | - | Sakshi
Sakshi News home page

సోదరభావానికి ప్రతీక రంజాన్‌

Mar 15 2026 6:55 AM | Updated on Mar 15 2026 6:55 AM

వనపర్తి: పవిత్ర రంజాన్‌ మాసం పరస్పర ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని.. ముస్లింలు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి కోరారు. రంజాన్‌ మాసం పురస్కరించుకొని శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్‌కు ఆయనతో పాటు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్‌లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపి పలువురికి రంజాన్‌ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ఐక్యత పెంపొందించే పండుగగా రంజాన్‌ ప్రత్యేక స్థానం కలిగి ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ఉపవాసం ద్వారా ఆత్మ నియంత్రణతో పాటు పేదలపై సానుభూతి పెంపొందుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, సహకారంతో సమాజ అభివృద్ధికి కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. రంజాన్‌ శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్‌ మాధవి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజహిద్‌, ముస్లిం మతపెద్దలు అఫ్జలుద్దీన్‌, రహీం, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement