వనపర్తి టౌన్: జిల్లాలో శనివారం పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. మొదటిరోజు జరిగిన తెలుగు, ఉర్దూ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 99.8 శాతం మంది విద్యార్థు లు హాజరయ్యారు. మొత్తం 37 కేంద్రాల్లో 7,219 మంది విద్యార్థులకుగాను 7,206 మంది పరీక్షల కు హాజరుకాగా.. 13 మంది గైర్హాజరయ్యారు. జి ల్లాకేంద్రంలోని అనూస్ పాఠశాల, చాణక్య పాఠశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, గోపాల్‌పేట మండలంలోని పరీక్ష కేంద్రాలను సహాయ పరీక్షల అధికారి గణేష్‌కుమార్ తని ఖీ చేశారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. అరగంట ముందు నుంచే విద్యార్థులను తనిఖీ చేసి అనుమతించడంతో ఎక్కడా ఎవరు అసౌకర్యానికి గురికాలేదు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్యసిబ్బందితో పా టు తాగునీరు, విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు.


