ఫిర్యాదులు పెరుగుతున్నాయి.. | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులు పెరుగుతున్నాయి..

Mar 15 2026 6:55 AM | Updated on Mar 15 2026 6:55 AM

వినియోగదారులు ఎవరైనా వస్తువులు కొనుగోలు చేసిన ప్రతి సందర్భంలో కూడా తప్పక బిల్లు తీసుకోవాలి. వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, ఇతర సమస్య ఏది ఉన్నా.. కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసిన బిల్లు లేకపోతే చట్టపరంగా ఎదుర్కొవడానికి రాదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకే ఒక్క కోర్టు ఉండటం వల్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రతి రోజు హక్కుల ఫోరంకు రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ వస్తువులు, జీవిత భీమా, చిట్‌ఫండ్‌, ఫైనాన్స్‌లలో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల నుంచి ఎవరు రావడం లేదు.. పట్టణ ప్రాంతాల నుంచి అవగహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారించడానికి కృషి చేస్తున్నాం. – అశోక్‌ వర్ధన్‌రాజు,

వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ సూపరిటెండెంట్‌

తూకాల్లో మోసాలు

తూనికల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారస్తులు తూకాల్లో తేడా చేస్తూ పేదలను మోసం చేస్తున్నారు. మరోపక్క వారాంతపు సంస్థలో బాట్లకు బదులు మోటు రాళ్లు పెట్టి తూకం చేసి వ్యాపారులు సామాన్యులతో భారీగా డబ్బులు గుంజుతున్నారు. అలాగే రైతులు పండించిన పంటలను దలారి వ్యాపారులు ఎలక్ట్రిక్‌ కాంటాల్లో మోసాలకు పాల్పడుతూన్నారు. తూనికల శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు.

– మోహన్‌ రెడ్డి, రైతు, మరికల్‌, నారాయణపేట జిల్లా

తరచుగా తనిఖీలు చేపట్టాలి..

వ్యవసాయ మార్కెట్లతోపాటు ప్రైవేటు వ్యాపారుల వద్ద నిర్వహిస్తున్న కాంటాల్లో తేడాలు ఉంటున్నాయి. ప్రామాణికమైన తూకం రాళ్లకు బదులుగా సాధారణ బండరాళ్లను వినియోగిస్తున్నారు. తూకంలో తేడాలు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లీగల్‌ మెట్రాలజీ అధికారులు తరచుగా తనిఖీలు చేపట్టాలి.

– వర్దం సైదులు, అచ్చంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement