
జూరాలకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో 2.05 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 31 క్రస్టు గేట్లు ఎత్తి 2,13,311 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి నుంచి 28,734 క్యూసెక్కులు వినియోగించుకుంటున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.512 టీఎంసీల నీరు నిల్వ ఉంది. – ధరూర్
కోయిల్‌సాగర్‌లో జలసిరి
కోయిల్‌సాగర్‌కు భారీగా వరద వస్తుండటంతో ఐదు గేట్లను అడుగు మేర ఎత్తి.. 7,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 32.6 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 2.27 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32 అడుగుల వద్ద 2.2 టీఎంసీల
నీటి నిల్వ ఉంది. – దేవరకద్ర
సరళాసాగర్ కళకళ..
సరళాసాగర్ జలాశయానికి సోమవారం ఎగువ నుంచి భారీగా వరద చేరింది.
దీంతో 3 వుడ్, 2 ప్రైమరీ సైఫన్ల నుంచి 11,350 క్యూసెక్కుల వరద దిగువకు పారినట్లు
అధికారులు వివరించారు. – మదనాపురం
రామన్‌పాడు 3 గేట్లు పైకెత్తి..
సరళాసాగర్, శంకరసముద్రం, ఊకచెట్టు వాగు నుంచి రామన్‌పాడు జలాశయానికి వరద రావడంతో సోమవారం జలాశయం 3 గేట్లు పైకెత్తి 18 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. – మదనాపురం
సుంకేసులకు వరద..
ఎగువన కురుస్తున్న వర్షాలతో సోమవారం సుంకేసుల జలాశయానికి భారీగా వరద చేరింది.92 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 17 గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 87,158 క్యూసెక్కులు దిగువకు, కేసీ కెనాల్‌కు 2,180 క్యూసెక్కులు వదిలినట్లు జేఈ తెలిపారు. – రాజోళి
సంగంబండ.. నిండుకుండ...
సంగంబండలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ఎగువ కర్ణాటకలోని ఇడ్లూర్,
నందేపల్లి వాగుల నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో సోమవారం 7 గేట్లు పైకెత్తి 5,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ డీఈ సురేష్ తెలిపారు. – మక్తల్

జూరాలకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

జూరాలకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

జూరాలకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

జూరాలకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

జూరాలకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో