
జూరాల వెనక జలాల నుంచి..
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వెనక జలాల నుంచి భూత్పూర్ రిజర్వాయర్‌కు సాగునీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తున్న సమయంలో రిజర్వాయర్‌కు నీటిని తరలించడంతో పాటు కాల్వల ద్వారా ఆయా గ్రామాల్లోని చెరువులు నింపుతున్నారు. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగడంతో పాటు మత్స్యకారులు చేపల పెంపకం చేపడుతున్నారు. పదేళ్లుగా భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వానాకాలంలో నీటిని వదులుతుండటంతో అమరచింత, ఆత్మకూర్, నర్వ, మక్తల్ మండలాల్లోని సుమారు 50 గ్రామాల రైతులకు సాగునీరు అందిస్తున్నారు. దింతో సాగునీరు లేక గత కొన్ని సంవత్సరాలుగా బీళ్ళుగా మారిన పంట పోలాలు పది సంవత్సరాలుగా పంట పోలాలు పచ్చని పంటలతో కళకళ లాడుతున్నాయి. భూత్పూర్ రిజర్వాయర్ ఎడమ కాల్వ అమరచింత పెద్ద చెరవు వరకు విస్తరించి ఉండటంతో చివరగా అమరచింత పెద్ద చెరువు నిండి అక్కడి నుంచి ఆత్మకూర్ మండలంలోని పిన్నంచర్ల, ఆత్మకూర్ చెరువులకు నీటిని తరలిస్తున్నారు.