
శనేశ్వరుడికి తైలాభిషేకాలు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శనేశ్వరాలయాన్ని సందర్శించి తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం స్వామివారికి తిల తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శి ంచుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్‌రావు, ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, పుల్లయ్య, వీరశేఖర్, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య పాల్గొన్నారు.