
యూరియా సరఫరాపై ఆందోళన వద్దు
ఖిల్లాఘనపురం: యూరియా సరఫరాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అన్ని ఎరువులు దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకుడు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని కమాలోద్ధీన్‌పూర్ రైతువేధికలో ఎరువుల యాజమాన్యంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదని.. ఖిల్లాఘనపురం మండలంలోనే 124 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. దొరుకుతుందో లేదోనని తొందరపడి ఎక్కువ కొనుగోలు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతాయని.. అవసరం మేరకు కొనుగోలు చేయాలని సూచించారు. నానో యూరియా, నానో డీఏపి కూడా మార్కెట్‌లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, ఏఈఓ సునీల్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
పొంగిపొర్లిన వాగులు..
నిలిచిన రాకపోకలు
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని కిష్టారెడ్డిపేట, వెంకటాపురం శివారులో ఉన్న వాగులు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహించాయి. ఆయా వాగులపై వంతెన నిర్మాణాలు పూర్తిగాకపోవడం.. పక్కన ఏర్పాటుచేసిన మట్టిరోడ్డుపై నీరు పారుతుండటంతో శుక్రవారం ఉదయం పెబ్బేరు– కొలాపూర్ రహదారిపై పోలీసులు వాహనాల రాకపోకలు నిలిపివేసి ఉధృతి తగ్గిన తర్వాత పునరుద్ధరించారు.
జిల్లా వ్యవసాయ సహాయ
సంచాలకుడు ప్రభాకర్‌రెడ్డి

యూరియా సరఫరాపై ఆందోళన వద్దు