
‘రక్షా’నుబంధం
అక్కాతమ్ముళ్లు.. అన్నాచెల్లెళ్లు అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనేదే రాఖీ పండుగ. సోదరి తన సోదరుడు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటే.. సోదరి కట్టిన రక్షాబంధాన్ని స్వీకరించిన సోదరుడు తానెప్పుడూ సోదరికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు. సమాజంలో నానాటికి బంధాలు చెదిరిపోతున్న తరుణంలో రక్షాబంధన్ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు అనుబంధాలను బలోపేతం చేస్తుంది. సోదర, సోదరీమణుల మధ్య ఉండే అనుబంధాలు.. ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగు, విచక్షణకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఆత్మీయుల మధ్య అనుబంధానికి, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా నిలుస్తుంది రాఖీ. ఆధునిక కాలంలోనూ ఎక్కడ ఉన్నా తమ అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు.. అక్కాచెల్లెళ్లు తరలివస్తుంటారు. అలాగే విదేశాల్లో ఉన్నవారు సైతం కొరియర్‌లోనూ తమవారికి రాఖీలు పంపిస్తూ.. అనుబంధాలను చాటి చెబుతున్నారు. ఇక సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్ట్రాగాంలోనూ
శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. – స్టేషన్ మహబూబ్‌నగర్/అచ్చంపేట/వనపర్తి టౌన్