
‘రెవెన్యూ’ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం
వనపర్తి రూరల్: భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం పెబ్బేరు, శ్రీరంగాపురం తహసీల్దార్ కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఉద్యోగుల హాజరు రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగులందరూ సకాలంలో కార్యాలయానికి రావాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రికార్డు గదిని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సక్రమంగా, భద్రంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అనంతరం పెబ్బేరులోని సత్యసాయి రైస్‌మిల్లును తనిఖీచేసి సీఎంఆర్‌ను త్వరగా అందించాలని.. రోజు ఒక ఏసీకే ధాన్యం ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు మురళీగౌడ్, రాజు, డిప్యూటీ తహసీల్దార్ నందకిషోర్, ఆర్‌ఐ రాఘవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయాలు,రైస్‌మిల్లు తనిఖీ
రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్