
క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలకు..
గోపాల్‌పేట: విద్యార్థులు క్రమశిక్షణతో శ్రద్ధగా చదివితేనే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆంగ్లం, గణితంలో నిర్వహించిన మండలస్థాయి పోటీ పరీక్షల బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయనతో పాటు బహుమతుల దాత సుఖేందర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులో ఉండి వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదివి చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రభాకర్, ఏదుల, గోపాల్‌పేట మండలాల ఉపాద్యాయులు పాల్గొన్నారు.