
విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలకం
వనపర్తి రూరల్: విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ చదువు కీలకమైందని.. భావి భవిష్యత్‌కు బీజం ఇక్కడే పడుతుందని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. గురువారం పెబ్బేరులోని మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ డా. టి.నరేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఇంటర్ విద్యార్థుల స్వాగతోత్సవానికి ఆయనతో పాటు జీసీడీఓ శుభలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఐఓ మాట్లాడుతూ.. కళాశాలలో బాలికలు క్రమశిక్షణ, నైతిక విలువలు పాటిస్తూ శ్రద్ధతో చదువుకోవాలని సూచించారు. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చిన్న గోపాల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
వనపర్తిటౌన్: హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని.. పంద్రాగస్ట్‌కి ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ పిలుపునిచ్చారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో అభియాన్ కన్వీనర్ పెద్దిరాజు ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి కార్యశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హర్ ఘర్ తిరంగా అనేది త్రివర్ణ పతాక వైభవాన్ని చాటే ప్రత్యేక పండుగగా మారిందన్నారు. ప్రధాని మోదీ ధృడ సంకల్పం, నిర్ణయాత్మక నాయకత్వం, సాయుధ దళాల ధైర్య సాహసాలు, దేశ ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు తోడవడంతో ఆపరేషన్ సింధూర్ గొప్ప విజయం సాధించిందని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, కేతూరి బుడ్డన్న, మోర్చాల రాష్ట్ర నాయకులు జ్యోతి రమణ, అలివేలమ్మ, సహా కన్వీనర్లు కదిరె మధు, బాసెట్టి శ్రీను, అశ్విని రాధా, జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, సుమిత్రమ్మ, విష్ణువర్ధన్‌రెడ్డి, అధికార ప్రతినిధులు తిరుమల్లేష్, మణివర్ధన్ సాగర్, గొర్ల బాబురావు, కార్యదర్శి రామ్మోహన్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్, మోర్చాల జిల్లా అధ్యక్షులు రాఘవేందర్‌గౌడ్, ఎండీ ఖలీల్, గంధం ప్రవీణ్, కల్పన తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటి ప్రచారం..
మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి, పథకాల అమలు ప్రతి ఇంటికి తెలియజేయాలనే లక్ష్యంతో ఇంటింటి ప్రచారం చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పీర్లగుట్ట, బండార్‌నగర్ కాలనీలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ ఓబీసీ అధికార ప్రతినిధి శ్రీశైలం, నాయకులు కేతూరి బుడ్డన్న, శ్రీనివాస్‌గౌడ్, తిరుమల్లేష్, సుమిత్రమ్మ, రాములు, దంతోజి నవీన్‌కుమార్ పాల్గొన్నారు.

విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలకం