
రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు పరిష్కరించాలి
గోపాల్‌పేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో భాగంగా ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆదేశించారు. బుధవారం ఆయన మండల కేంద్రం, ఏదులలోని తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారులు కార్యాలయానికి వచ్చే రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో పరిష్కారం కాని వాటిని మరోమారు పరిశీలించాలన్నారు. ఆయన వెంట గోపాల్‌పేట, ఏదుల తహసీల్దార్లు పాండునాయక్, మల్లికార్జున్, సిబ్బంది ఉన్నారు.