
పవిత్రోత్సవాలు ప్రారంభం
వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి ప్రతిష్ఠ, చతుస్థానార్చన, ద్వారాతోరణ పూజ, హోమశాలలో హోమం, ఆలయంలోని అన్ని మూలమూర్తులు, ఉత్సవమూర్తులు, ఆలయానికి పట్టు పవిత్రమాల అలంకరణ, మహా నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్రోత్సవాలు మూడురోజుల పాటు కొనసాగనుండగా.. గురువారం మహా పూర్ణాహుతి అనంతరం పవిత్రమాలలను తొలగించి 108 కలశాలతో అమ్మ, స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. తదుపరి కై ంకర్యపరులకు పవిత్రమాలల బహూకరణ, ఆచార్య సన్మాన కార్యక్రమాలతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.

పవిత్రోత్సవాలు ప్రారంభం