
నేతన్నకు.. భరోసా
నూతన పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
●
రూ.18 వేలు ఇస్తామన్నారు..
నేతన్నకు భరోసా పథ కం ద్వారా ప్రతి సంవత్సరానికి రూ.18 వేలను ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు తె లిపారు. మగ్గానికి ఇద్దరికి అవకాశం కల్పిస్తామన్నారు. దీంతో నాతోపాటు సహాయ కార్మికురాలిగా ఉన్న నా భార్యతో కలిసి ఇరువురం దరఖాస్తు చేసుకున్నాం.
– చిన్ని ప్రకాష్, నేత కార్మికుడు, అమరచింత
అవసరాలకు ఉపయోగం..
ప్రభుత్వం కొత్తగా నేతన్నకు భరోసా పథకం తీసుకొచ్చిందని సొసైటీ వాళ్లు చెప్పారు. సహాయ కార్మికులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఇస్తామన్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్నా. ఏడాదికి వస్తున్న రూ.6 వేలు కుటుంబ అవసరాలకు ఉపయోగపడనున్నాయి.
– గాజుల సంధ్య,
చేనేత సహాయ కార్మికురాలు, అమరచింత
సద్వినియోగం చేసుకోండి..
నేతన్నకు భరోసా పథకం ద్వారా చేనేత కార్మికుల నుంచి మంగళవారం దరఖాస్తులు స్వీకరిస్తాం. జిల్లా మొత్తంలో 641 మంది కార్మికులు ఉండగా వీరందరికీ పథకం వర్తిస్తుంది. అయితే ఇప్పటి వరకు 346 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వారు కూడా మంగళవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకొని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– గోవిందయ్య, చేనేత, జౌళీశాఖ ఏడీ
అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఆదుకోనేందుకు వివిధ సంక్షేమ పథకాలను అమలు పరుస్తుంది. ఈ క్రమంలో కొత్తగా నేతన్నకు భరోసా పథకం ప్రవేశపెట్టి ఏడాదికి ప్రధాన కార్మికుడికి రూ.18 వేలు, సహాయ కార్మికుడికి రూ.6 వేల చొప్పున అందించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి గాను విధివిధానాలు సైతం రూపొందించడంతో సంబంధిత చేనేత జౌళీశాఖ అధికారులు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే గత నెల 30 వరకే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం తాజాగా మంగళవారం వరకు పొడిగింది. దీంతో ఇప్పటికీ నేతన్న భరోసాకు దరఖాస్తు చేసుకోలేని కార్మికులు త్వరితగతిన దరఖాస్తులను సంబంధిత చేనేత జౌళిశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షులకు, సొసైటీ సభ్యులకు తెలియపరుస్తూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. చేనేత వృత్తిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను నిరుపేద కార్మికులకు అందిస్తూ.. వారి అభ్యున్నతికి తమవంతు కృషిచేస్తుండటంతో అందివచ్చిన అవకాశాలను కార్మికులను సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా.. జిల్లాలో జియోట్యాగ్ కలిగిన నేత కార్మికులు 641 మంది ఉండగా.. నేతన్నకు భరోసా పథకం కోసం ఇప్పటి వరకు కేవలం 346 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు జౌళీశాఖ అధికారులు వెల్లడించారు. మిగతా వారంతా మంగళవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జియోట్యాగ్ కలిగిన నేత కార్మికులు
641 మంది
నేతన్నకు భరోసా కోసం దరఖాస్తు
చేసుకున్న వారు 346 మంది
సహాయ కార్మికుడికి అందించే సహాయం రూ.6,000
ప్రధాన కార్మికుడికి
అందించే సహాయం రూ.18,000
ఇద్దరు కార్మికులకు అవకాశం..
ప్రభుత్వం తీసుకోచ్చిన నేతన్నకు భరోసా పథకం కార్మికుడి కుటుంబానికి భరోసా కల్పిస్తుందని జౌళిశాఖ అధికారులు తెలిపారు. భరోసా పథకం ద్వారా జియో ట్యాగ్ కలిగిన మగ్గానికి ఇద్దరు కార్మికులకు అవకాశం కల్పించారు. వీరిలో ప్రధాన కార్మికుడికి ఏడాదికి రూ.18 వేలు ఇస్తుండగా.. సహాయ కార్మికుడికి రూ.6 వేలు అందిస్తుంది. వీటిని ఏడాదిలో రెండు పర్యాయాలు (6 నెలలకు ఒకసారి) భరోసా డబ్బులను అందించనున్నట్లు వెల్లడిస్తున్నారు. కార్మికుల పిల్లల చదువులతోపాటు ఇతర అవసరాలకు భరోసా ద్వారా వచ్చే డబ్బులు ఆదుకుంటాయని అభిప్రాయపడుతున్నారు.
త్రిఫ్ట్ ఫండ్‌తోపాటు అదనపు ఆదాయం
అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
నేటి వరకు గడువు పొడిగింపు
జిల్లా అర్హులైన కార్మికులు 600 మందికిపైనే..
ఇంకో
చేసుకోవాల్సిన వారు
295

నేతన్నకు.. భరోసా

నేతన్నకు.. భరోసా

నేతన్నకు.. భరోసా